national

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు- ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేగానీ!

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 2:57 PM IST

jammu kashmir lieutenant governor
jammu kashmir lieutenant governor (ANI)

Jammu Kashmir Lieutenant Governor Rights :అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే అధికారులు, పోలీసుల పోస్టింగ్‌లు, బదిలీలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర హోంశాఖ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెట్టింది. ఏసీబీ అధికారులతోపాటు అడ్వకేట్‌ జనరల్‌, ఇతర న్యాయమూర్తుల నియామకాలపై నిర్ణయాధికారం కూడా ఎల్​జీకి అప్పగించింది. కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా కేంద్రం హోంశాఖ మరికొన్ని అధికారాలు జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగించింది. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370అధికరణను రద్దు చేసిన కేంద్రం, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న మునుపటి నిబంధనలను సవరించి పోలీస్‌, పబ్లిక్‌ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్‌, అవినీతి నిరోధక శాఖలపై పలు అధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details