NDA ప్రభుత్వం పొరపాటున ఏర్పడింది- ఎప్పుడైనా కూలిపోవచ్చు: ఖర్గే
Published : Jun 15, 2024, 11:59 AM IST
Mallikarjun Kharge on NDA: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవటంలేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయటం ప్రధాని మోదీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు.