national

తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 7:17 AM IST

Updated : Jul 28, 2024, 9:12 AM IST

Governors Appointments
Governors Appointments (ANI)

Governors Appointments : తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ, పుదుచ్చేరిలకు ఇన్‌ఛార్జిగా సేవలందిస్తున్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రామెన్ డెకా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఝార్ఖండ్ గవర్నర్ అయ్యారు. కర్ణాటకకు చెందిన సీహెచ్ విజయ శంకర్, మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఓం ప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్ అయ్యారు. హరిభావ్ కిషన్‌రావ్ రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కె కైలాసనాథన్‌ను రాష్ట్రపతి నియమించారు. అసోం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్‌గానూ, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గానూ బదిలీ అయ్యారు. అసోం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఆయనకు అదనంగా మణిపుర్ బాధ్యతలను అప్పగించారు.

Last Updated : Jul 28, 2024, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details