General Upendra Dwivedi Army Chief :లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ మనోజ్ పాండే నేషనల్ వార్ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించి ఆదివారం ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. అనంతరం తన బాధ్యతలను ఉపేంద్ర ద్వివేదికి అప్పగించారు.
ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు- చిన్ననాటి స్నేహితుడితో కలిసి!
Published : Jun 30, 2024, 3:23 PM IST
1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నావికాదళానికి నాయకత్వం వహిస్తున్న అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ, ఉపేంద్ర ద్వివేది చిన్ననాటి స్నేహితులు కావడం గమనార్హం. దృఢమైన స్నేహబంధం కలిగిన ఇద్దరు నాయకులు కలిసి భారత సైనిక దళాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని రక్షణశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.