national

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 1:27 PM IST

ETV Bharat / snippets

ఐస్‌క్రీమ్​లో మనిషి వేలు- షాకై డాక్టర్ కంప్లైంట్​- రంగంలోకి ఫోరెన్సిక్‌ నిపుణులు!

Finger In Ice Cream Mumbai
Finger In Ice Cream Mumbai (Getty Images)

Finger In Ice Cream Mumbai : ముంబయికి చెందిన ఓ డాక్టర్‌ కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో ఏకంగా మనిషి వేలు వచ్చింది. దీంతో ఆయన షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వేలును ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. అసలేం జరిగిందంటే?

ముంబయికి చెందిన డాక్టర్‌ ఓర్లెమ్‌ బ్రెండన్‌ సెర్రావో తన సోదరితో కలిసి బుధవారం ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్‌ పెట్టారు. వారు కొనుగోలు చేసిన ది యుమ్మో బటర్‌స్కాచ్‌ ఫ్లేవర్‌ కోన్‌ ఐస్‌క్రీమ్‌లను ఆ సంస్థ డెలివరీ చేసింది. ఐస్ క్రీమ్​ను డాక్టర్ తినడం మొదలుపెట్టాక నాలుకకు ఏదో గట్టిగా తగలడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చి చూడగా మనిషి వేలు కన్పించింది. డాక్టర్ కావడం వల్ల వెంటనే గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆ ఐస్‌క్రీమ్‌ తయారీ సంస్థ ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు.

ABOUT THE AUTHOR

...view details