ETV Bharat / snippets

అత్యాచారం కేసులో నటుడు సిద్దిఖీకి ఊరట- ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Actor siddique Bail
Actor siddique Bail (ETV Bharat)

Actor siddique Bail : నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్దిఖీకి రెండు వారాల పాటు రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్​ను మంజూరు చేసింది. మందస్తు బెయిల్​ను నిరాకరించిన కేరళ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సిద్ధిఖీకి ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ, కేరళ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్‌లో సిద్దిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేసింది. తమిళ చిత్రంలో ఓ పాత్ర ఇప్పిస్తానని, అందుకు ప్రతిగా కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. అందుకు తాను నిరాకరించగా అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇటీవల మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీగా సిద్దిఖీ ఎంపికయ్యారు. ఆయన ఈ లైంగిక ఆరోపణలు తెరపైకి రావడం వల్ల ఆ పదవికి రాజీనామా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.