Monsoon Season 2024 : ఈ ఏడాది సాధారణం కంటే 7.6శాతం ఎక్కువ వర్షపాతంతో మాన్సూన్ సీజన్ ముగిసిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది. ఐఏండీ గణాంకాల ప్రకారం, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భారత వ్యవసాయ రంగానికి వర్షకాలం చాలా కీలకం. దేశ నికర సాగు విస్తీర్ణంలో దాదాపు 52 శాతం వర్షాధారమే.
అంతేకాకుండా, అక్టోబర్, డిసెంబర్లో దక్షిణ, మధ్య, ఈశాన్య భారతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక దక్షిణ, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పింది.