national

గవర్నర్​కు నిరసన సెగ- సీఎంతో సహా రాజ్​భవన్​ వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 2:20 PM IST

Karnataka Congress
Karnataka Congress (ETV Bharat)

Karnataka Congress Protest : మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూకేటాయింపు వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతిచ్చిన కర్ణాటక గవర్నర్‌ తావర్‌చంద్ గెహ్లోత్‌ తీరును నిరసిస్తూ, అధికార కాంగ్రెస్ "రాజ్‌భవన్ ఛలో" నిర్వహించింది. తొలుత విధానసౌధ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసన తెలిపారు. అనంతరం డీకే శివ కుమార్ నేతృత్వంలో రాజ్‌భవన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీలో సిద్ధరామయ్య పాల్గొనలేదు.

మైనింగ్ లీజుల అక్రమాల కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామి, జనార్దన్ రెడ్డిలపై విచారణకు అనుమతివ్వాలని కోరుతున్నప్పటికీ గవర్నర్‌ గెహ్లోత్ స్పందించడంలేదని, మంత్రులు ఆరోపించారు. నాలుగైదు పిటిషన్లు తన వద్ద పెండింగ్‌లో ఉన్నా గవర్నర్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం సిద్ధరామయ‌్యపై విచారణకు అనుమతించడం కాంగ్రెస్‌పై వివక్షేనని ఆరోపించారు. మిగిలిన పిటిషన్లపైనా విచారణకు అనుమతించాలని గవర్నర్‌కు మంత్రులు వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details