పోలీస్ స్టేషన్‌లో జడ్పీటీసీ భర్త డ్యాన్స్ - వైరల్ అవుతున్న వీడియో - ZPTC Husband Dance in Station - ZPTC HUSBAND DANCE IN STATION
Published : Apr 15, 2024, 3:53 PM IST
ZPTC Husband Dance in Police Station : నిత్యం ప్రజలు తమ బాధలను చెప్పుకోడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే, జడ్పీటీసీ భర్త శ్రీనివాస్ మాత్రం డ్యాన్స్ చేయడానికి వెళ్లాడంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ సినిమా పాటకు స్టెప్పులు వేయడంతో జడ్పీటీసీ (ZPTC) భర్త శ్రీనివాస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ZPTC Husband Dance in Police Station viral video : జిల్లాలోని మహాదేవపూర్ ఠాణాలో ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇలా చేయడమేంటని ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కేసులతో హడావుడిగా ఉండే రక్షక భట నిలయం, డ్యాన్స్ క్లబ్‌గా మారిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలతో పాటు పలువురు నేతలు సైతం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.