వైసీపీ అభ్యర్థితో రహస్య సమావేశం- టీడీపీ శ్రేణులు రాకతో జారుకున్న వాలంటీర్లు - Ysrcp Mla Meeting With Volunteers - YSRCP MLA MEETING WITH VOLUNTEERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 9:15 PM IST
YSRCP Mla Joga Rao Meeting With Volunteers : ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాలంటీర్లు ప్రచారంలో, సమావేశాల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం పదేపదే చెబుతున్నా, తొలగిస్తున్నా అధికార పార్టీ అండ చూసుకుని ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వాలంటీర్లు ప్రవర్తిస్తున్నారు
పార్వతీపురం మన్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, అభ్యర్థి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగారావు ఇంట్లో వాలంటీర్లు రహస్య సమావేశం అయ్యారు. విషయం తెలసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోనెల విజయచంద్ర, పార్టీ కార్యకర్తలతో కలిసి జోగారావు ఇంటికి వెళ్లారు. తెలుగుదేశం శ్రేణులను గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్ చంద్రను, ఆయన అనుచరులను ఆధికార పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. విజయ్ చంద్రతో పాటు, ఆయన అనుచరులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వాలంటీర్లు పారిపోతున్న వీడియో తీస్తున్న టీడీపీ అనుచరుల ఫోన్లను వైసీపీ నాయకులు లాక్కుని విజయచంద్ర కారును అడ్డుకున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. వైసీపీ నాయకులు లాక్కున్న ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మండ్డిపడుతున్నారు.