వైఎస్సార్సీపీ అక్రమాలపై నారా లోకేశ్‌కు ఫిర్యాదు - టీడీపీ కౌన్సిలర్‌పై దాడి - వైసీపీ నేతల అక్రమాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:33 PM IST
YSRCP Leaders Attack on TDP Councillor : 'మా జోలికొస్తావా, మా అక్రమాలను నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్తావా' అంటూ పలువురు వైఎస్సార్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌పై దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే, బుధవారం నారా లోకేశ్ శంఖారావం యాత్రలో భాగంగా పార్యతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. లోకేశ్ బహిరంగ సభ అనంతరం స్థానికులు ఆయన దృష్టికి వైఎస్సార్సీపీ నేతల అక్రమాలను, భూ సమస్యలను తీసుకువెళ్లారు. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు టీడీపీ నేతలపై కక్ష కట్టారు.
రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు పదుల సంఖ్య కార్యకర్తలు జిల్లా కేంద్రానికి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్ నారాయణరావుపై ఇంటి వద్దకు వెళ్లారు. అనంతరం నారాయణరావుపై వైఎస్సార్సీపీ నాయకులు కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఎమ్మెల్యే జోగారావు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ విజయ్ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవి ఖండించారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు.