ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉరవకొండలో పోలింగ్​ అధికారులతో వైఎస్సార్సీపీ శ్రేణుల వాగ్వాదం - Uravakonda Polling Arrangements

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 11:46 AM IST

YSRCP Leaders Argument with Polling Officials in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ పాఠశాలలోని 129 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులతో వైఎస్సార్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను అనుమతించలేదంటూ పోలింగ్ కేంద్రంలోకి వైఎస్సార్సీపీ నాయకులు దూసుకొచ్చి గందరగోళం సృష్టించారు. ఏజెంట్లు సకాలంలో  రాకపోవడంతోనే అనుమతించడం లేదని అధికారులు తేల్చి చెప్పారు.  వైఎస్సార్సీపీ నాయకులు పోలింగ్‌ కేంద్రంలోకి రావడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం రోజు సాయంత్రమే పోలింగ్​ ఏజెంట్లు వారి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా వైఎస్సార్సీపీ వారు చేసుకోకపోగా ఏజెెంట్లమని నేరుగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. దీంతో పోలింగ్ అధికారులు మండిపడ్డారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించారు. తమవైపు తప్పు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ దురుసుగా ప్రవర్తించడం ఏంటని పోలింగ్​ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులు, కిడ్నాప్​లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ​ 

ABOUT THE AUTHOR

...view details