ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'సైకిల్​కు ఓటేస్తే ఊర్లో ఉండరు' - వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజగోపాల్​రెడ్డి బెదిరింపులు - Mekapati Rajagopal Reddy - MEKAPATI RAJAGOPAL REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 10:14 AM IST

YSRCP Leader Mekapati Rajagopal Reddy Comment on Voters in Sakunalapalli : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీ నాయకుల్లో  ఓటమి భయం పట్టుకుంది. గత కొంత కాలంగా ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన అధికార నేతలు ఇప్పుడు వారిపై బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు. తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీస్తే నోర్ముయ్​ అంటూ గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేత ఒకరు అయితే, సైకిల్​ గుర్తుకు ఓటు వేసిన వారిని ఎవ్వరినీ ఊర్లో ఉండనివ్వనని మరొక నేత బెదిరింపులకు దిగారు.  

మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్​ గుర్తుకు ఓటేసిన వారెవ్వరీనీ ఊర్లో ఉండనివ్వనని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్​ రెడ్డి హెచ్చరించారు. గత శనివారం ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉదయగిరి మండలం మూలపల్లె, శకునాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శకునాలపల్లిలో జరిగిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేకపాటి రాజగోపాల్​ రెడ్డి తీరుపై మూలపల్లె, శకునాలపల్లి ఓటర్లతో పాటు స్థానిక విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details