ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

"ఇండియా" కూటమితో కలిస్తే తప్పేంటి- అది మా పార్టీ వ్యవహారం: బొత్స సత్యనారాయణ - JAGAN MET India ALLIANCE LEADERS - JAGAN MET INDIA ALLIANCE LEADERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 8:05 PM IST

Botsa SatyaNarayana on Met India Alliance Leaders : "ఇండియా" కూటమి నాయకులతో కలిస్తే తప్పేంటని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. హత్యా రాజకీయాలపై దిల్లీకి వెళ్లి ధర్నా చేయడంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎక్కడ ఏం చేయాలన్నది తమ పార్టీ ఇష్టమని తెలిపారు.

విశాఖ డ్రగ్స్ కలకలం విషయంలో ఎన్నికల ముందు వైఎస్సార్సీపీపై టీడీపీ నేతలు నిందలు వేశారని, పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చెశారు. విశాఖలో భూకుంభకోణాలపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన సిట్ నివేదికను బయటపెట్టాలని కోరారు. వైఎస్సార్సీపీ పాలనలో వేసిన సిట్‌ నివేదిక బహిర్గతం చేయాలని తాను అడిగినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని బొత్స చెప్పారు.

తాను ఎమ్మెల్యేను కానప్పుడు అసెంబ్లీకి వెళ్లమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఎలా చెప్పగలనని మాజీ మంత్రి అన్నారు. ఏపీ అప్పుల పాలైందని, శ్రీలంక, సోమాలియాలా మారిపోతోందని అప్పట్​లో చంద్రబాబు చెప్పారని, తనకు సంపద సృష్టి తెలుసున్న చంద్రబాబు ఇప్పుడు ఏమి చేస్తారో చూద్దామని అన్నారు. కొద్ది రోజులు ఆగితే విషయాలు తెలుస్తాయని. ఖజానాలో డబ్బులు ఉంటే ఇవ్వచ్చు అని వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details