ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని అడిగినందుకు వైఎస్సార్సీపీ నేతల దాడి - వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ వార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 3:48 PM IST

YSRCP Flexy War In Guntur: గుంటూరు తూర్పులో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలు చించి వీరంగం సృష్టించారు. ప్రైవేట్ హోర్డింగ్స్‌పై టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు చించేశారు (Flexi was torn). ఆ స్థానంలో వైఎస్సార్సీపీ నేత నూరీ ఫాతిమా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రశ్నించిన టీడీపీ నాయకులపై దాడులకు (Attack) తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడానికి టీడీపీ నేతలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

TDP Leaders Discussed Issue with Additional Commissioner in Municipal Corporation: నగరపాలక సంస్థ అదనపు కమిషనర్​ను కలసి టీడీపీ నాయకులు సమస్యను విన్నవించారు. నగరపాలక సంస్థ అధికారులు వైఎస్సార్సీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ తూర్పు ఇంఛార్జి నసీర్ అహ్మద్ అన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్​లపై వైఎస్సార్సీపీ ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తుంటే అధికారులు ఎం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్​లను తొలగించకుంటే తాము తొలగిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details