ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీలో తారస్థాయికి వర్గవిభేదాలు - రాచమల్లుకు టికెట్‌ ఇస్తే సహకరించబోమన్న నేతలు - mla Rachamallu Siva Prasad Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:15 PM IST

YSRCP Dissident Leaders Meeting : సీఎం జగన్‌ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డికి రానున్న శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఖరారు చేయవద్దని ఆ పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే అసమ్మతి నాయకులు కోరారు.  ప్రొద్దుటూరులోని కొర్రపాడులో సమావేశం అయ్యారు. అనంతరం వారంతా విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ విష‌యంలో జ‌గ‌న్ ఆలోచించాల‌ని, రాచమల్లుకు టిక్కెట్టు ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. రెండోసారి ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఆయన అవినీతికి అంతే లేకుండా పోయిందని, వలస వచ్చిన వారికి పదవులు ఇచ్చి నిజమైన కార్యకర్తలను మోసం చేశారని ఆరోపించారు.

Meeting Against MLA Rachamallu Siva Prasad Reddy : కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీపీల పదవుల్లోనూ జోక్యం చేసుకున్నారని అసమ్మతి నేతలు అన్నారు. కూరగాయల మార్కెట్ నుంచి ప్రతి అంశంలోనూ, అవినీతికి పాల్పడ్డారని, రాచమల్లుకు ప్రజల్లో చెడ్డ పేరు ఉందని వారంతా విమర్శించారు. పార్టీకి న‌మ్ముకుని నిజాయితిగా ప‌ని చేస్తున్న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేసి ఎమ్యెల్యే రాచ‌మ‌ల్లు ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లుకు కాకుండా ఇంకెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. రాచమల్లుకే  టిక్కెటిస్తే తాము ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని అసమ్మతి నేతలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details