జగనన్న వస్తున్నాడు అందరూ సిద్ధంగా ఉండండి: పెద్దిరెడ్డి - Jagan Sidham Bus Yatra - JAGAN SIDHAM BUS YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 5:16 PM IST
YSRCP Chief Jagan Sidham Bus Yatra in Joint Chittoor District: ఏప్రిల్ 3, 4 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర కోనసాగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలోని మంత్రి కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులతో పెద్దిరెడ్డి మేమంతా సిద్ధం సమన్వయ సమావేశం నిర్వహించారు. సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సిద్ధం సభ పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ అభ్యర్ధులు ఆవిష్కరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3, 4తేదీలో ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్దం సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 3వ తేదీ చిత్తూరు లేదా పూతలపట్టులో, 4వ తేదీ నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలన్నారు.