పెద్దిరెడ్డి బంధువులు, కార్యకర్తలు నన్ను హతమార్చేందుకు యత్నించారు: రామచంద్రయాదవ్ - YSRCP Attacked BCYP Ramachandra - YSRCP ATTACKED BCYP RAMACHANDRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 1:56 PM IST
YSRCP Attacked on BCYP State President Ramachandra Yadav : పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, ఆరాచకాలు, రౌడీయిజాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అన్నారు. గ్రామాల్లో ప్రజల నుంచి తమకు వచ్చిన మద్దతు చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సదూంలో పెద్దిరెడ్డి బంధువులు, కార్యకర్తలు తరలివచ్చి తమ వాహనాలపై దాడి చేసి తనను హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్ధ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఈ ఐదేళ్లలో ప్రజల్ని అన్ని రకాలుగా వేధించి ఇబ్బంది పెట్టి భయానక పరిస్థితిలు సృష్టించారు. నియోజకవర్గ ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతడి కొడుకు మిథున్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది తట్టుకోలేక మాపైకి దాడికి ఒడిగట్టారు. వారి అంతిమ లక్ష్యం నన్ను చంపడమే అని స్పష్టంగా తెలుస్తుందని రామచంద్రయాదవ్ ఆరోపించారు.