ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ రోడ్​షోలో డబ్బులు, మద్యం - మత్తులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు - alcohol supply in cm meeting - ALCOHOL SUPPLY IN CM MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 1:22 PM IST

YSRCP Activitists Drinking Alcohol In Jagan Road Show: సీఎం జగన్ మేమంతా సిద్ధం కార్యక్రమం మద్యం సేవించడానికి వేదికగా తయారైంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జగన్ రోడ్​షోలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు మత్తులో ఊగిపోయారు. ఒకవైపు జాతీయ రహదారిపై రోడ్​షో జరుగుతుండగా మరోపక్క వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్యం మత్తులో మునిగిపోయారు.

Jagan Memantha Siddham Road Show At Kadiri: ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మద్యం తాగుతూ కనిపించడంతో చోదకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు 500 రూపాయిలతో పాటు మద్యం బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కార్యకర్తలకు నగదు పంపిణీ చేస్తూ కనిపించడంతో విపక్షలు మండిపడ్డాయి. కదిరి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో రోడ్డు పక్కన, ఆటోలు, గోడ చాటున మద్యం సేవిస్తూ కనిపించాడు. 

జగన్‌ బస్సుయాత్ర సందర్భంగా ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కదిరి-అనంతపురం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాత్రి 9 వరకు సర్వీసులను పునరుద్ధరించకోపోవటంతో సుమారు 20 సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో డిపోకు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details