ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీలో 100మంది వైఎస్సార్సీపీ కార్యకర్తల చేరిక - ఆహ్వానించిన ఆరిమిల్లి - టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 1:35 PM IST

YSRCP Activists Joined in TDP: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇన్నాళ్లు అన్యాయానికి గురైన వివిధ సామాజిక వర్గీయులు తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న పార్టీలవైపు దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్తులోనైనా తమ బతుకులు బాగుపడతాయనే ఆశతో పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో బీసీ వర్గానికి చెందిన 100మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. 

తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీ కండువా కప్పి స్వాగతించారు. వైఎస్సార్సీపీ పాలనపై విసుగు చెంది, సీఎం జగన్‌ వైఖరిని తట్టుకోలేక కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరారని ఆరిమిల్లి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన అభ్యర్థుల విజయానికి పార్టీలో చేరిన వారు కృషి చేయాలని సూచించారు.

"వైఎస్సార్సీపీ పాలనపై విసుగు చెంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిని తట్టుకోలేక 100మంది కార్యకర్తలు తెలుగుదేశంలోకి చేరారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో బీసీలకు ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. రాబోయే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వంలో తమ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన అభ్యర్థుల విజయానికి పార్టీలో చేరిన వారు కృషి చేయాలని కోరుతున్నాను." - ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details