ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వివేకా హత్య కేసులో సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ - విచారణ 29కి వాయిదా - ys viveka murder case - YS VIVEKA MURDER CASE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 7:46 PM IST

YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఓ వైపు సీబీఐ అధికారులు, మరోవైపు నిందితుల తరఫు వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. తనను సాక్షిగా పరిగణించాలంటూ కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి, తాను కోర్టుకు హాజరు కాలేనంటూ ఎంపీ అవినాష్​​ రెడ్డి ​దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు 29కి వాయిదా వేసింది.  

హైదరాబాద్​లోని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఎంపీ అవినాష్ రెడ్డి, దస్తగిరి కోర్టుకు హాజరుకాలేమంటూ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ పై ఉన్న శివశంకర్ రెడ్డితో పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్ తో పాటు మిగతా నిందితులు హాజరయ్యారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్‌పైనా వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ పై ఎలాంటి అభ్యంతరం లేదంటూ సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పును రిజర్వు చేసి 29వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details