LIVE : వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ సునీత - కడప నుంచి ప్రత్యక్షప్రసారం - YS vivekananda Death Anniversary
Published : Mar 15, 2024, 12:39 PM IST
|Updated : Mar 15, 2024, 1:23 PM IST
YS Viveka Death Anniversary Program Live : మాజీ మంత్రి వైఎస్ వివేకా మరణించి నేటికి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది. ఆయన 5వ వర్దంతి సందర్భంగా కడపలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి, భార్య సౌభాగ్యమ్మతో పాటు ఇతర నాయకులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌభాగ్యమ్మ మాట్లాడుతూ, ‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటెయ్యొద్దన్న నా కుమార్తె సునీత పిలుపుతో నేనూ ఏకీభవిస్తున్నా. ఓటెయ్యొద్దని రాష్ట్ర ప్రజలకు నేనూ పిలుపునిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోంది’ అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. ‘నా భర్త హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. వివేకా హత్య గురించి బాహ్యప్రపంచాని కంటే ముందే జగన్‌కు, ఆయన సతీమణి భారతికి తెలుసన్న అనుమానం ఉంది’ అని ఆమె తెలిపారు. వివేకా హత్య విషయం తెల్లవారుజామునే జగన్‌కు తెలిసినా సాయంత్రం వరకు పులివెందుల ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
Last Updated : Mar 15, 2024, 1:23 PM IST