LIVE: దిల్లీలో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - YS Sunitha Reddy live
Published : Mar 1, 2024, 11:14 AM IST
|Updated : Mar 1, 2024, 12:40 PM IST
YS Sunitha Reddy in Delhi Live: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందుల నుంచి దిల్లీ దాకా తనకు నిరంతర సహకారం అందించిన న్యాయవాదులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన పోరాటంలో తనకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలపారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికి అక్కడే ఉందని చెప్పారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని అన్నారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే తనకు న్యాయం జరుగుతుంది వైఎస్ సునీతా రెడ్డి వివరించారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన ఐదేళ్లు పూర్తి కావస్తుంది. వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. తన నివాసంలో దారుణంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. గతేడాది జూన్ 3న అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అనినాశ్‌రెడ్డి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.
Last Updated : Mar 1, 2024, 12:40 PM IST