ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: విశాఖపట్నంలో వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ - ప్రత్యక్ష ప్రసారం - ys sharmila press meet - YS SHARMILA PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 9:59 AM IST

Updated : Apr 28, 2024, 10:22 AM IST

YS Sharmila Press Meet in Visakhapatnam: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలో వైఎస్ షర్మిల రెండో రోజు ప్రచారం చేపట్టారు. నేడు విశాఖ నార్త్‌, టెక్కలి, పలాసలో షర్మిల బహిరంగ సభలలో పాల్గొంటారు. షర్మిల ప్రచార జోరును పెంచారు. సీఎం జగన్​ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డీఎస్సీ ఇచ్చారని పలు బహిరంగ సభల్లో షర్మిల విమర్శిస్తున్నారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు, సీఎం జగన్​ మాత్రం అయిదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు సిద్దమంటూ నిద్రలేచారని వివిధ సభలలో ఎద్దేవా చేశారు. గతంలో పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగాను అని చెప్పి ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. ఆ మద్యం తాగి ప్రజలు చనిపోతున్న పట్టించుకోలేని పరిస్థితిలో సీఎం జగన్​ ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న షర్మిల, విశాఖలో ప్రెస్ మీట్​లో మాట్లాడారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Apr 28, 2024, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details