ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రధాని మోదీకి ఏపీ పీసీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల లేఖ - Ap partition guarantees

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 10:03 PM IST

YS Sharmila writes to PM Modi: పునర్విభజన చట్టం ప్రకారం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన అంశాలను నెరవేర్చాలని పేర్కోంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఏపీని ఆదుకునే బాధ్యత కేంద్రానిదేనని అందులో షర్మిల పేర్కోన్నారు. పూర్తికాని హామీల గురించి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాలని ఆమె కోరారు. వాటిపై ఎన్నికల ముందే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఓ చారిత్రక అవసరంగా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అమోదం తెలిపిందని అన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి నెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమలు పై చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. ప్రత్యేక హోదా , పోలవరం ప్రాజెక్టు పూర్తి అత్యంత కీలకమైన హామీలని అయితే తదుపరి ప్రభుత్వాలు వాటిని పట్టించుకోకపోవటం శోచనీయమని షర్మిల లేఖలో పేర్కోన్నారు. 

విభజన కారణంగా  ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని షర్మిల లేఖలో వెల్లడించారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ,విశాఖ రైల్వే జోన్ లాంటి అంశాలు ఇంకా ఆచరణలోకి రాలేదని లేఖలో  స్పష్టం చేశారు. కలహండి-బలంగీర్, బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందన్నారు. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని షర్మిల ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details