ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ షర్మిల న్యాయ యాత్ర - ప్రత్యక్షప్రసారం - SHARMILA ELECTION CAMPAIGN KADAPA - SHARMILA ELECTION CAMPAIGN KADAPA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 7:52 PM IST

Updated : Apr 7, 2024, 9:04 PM IST

YS Sharmila Election Campaign Live : వైఎస్సార్‌ జిల్లా కడపలో మూడో రోజు వైఎస్ షర్మిల న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సొంత గడ్డ కడప నుంచే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా వైఎస్​ షర్మిల యాత్ర కొనసాగింది. షర్మిలకు తోడుగా వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. వైఎస్‌ వివేకానంద హత్య కేసులో న్యాయం చేయాల్సిన అన్నే చెల్లెళ్లపై నిందలు మోపుతున్నారని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డే లక్ష్యంగా ఇద్దరూ ప్రచారాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. సొంత జిల్లాలో సీఎం జగన్​కు వ్యతిరేకంగా ఆయన సోదరి వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం చేయటం వైసీపీను ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబాయిని చంపిన వారికి జగన్‌ టికెట్ ఇవ్వటం జీర్ణించుకోలేకనే కడప నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రస్తుతం కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ షర్మిల న్యాయ యాత్ర ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated : Apr 7, 2024, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details