జగన్‌పై రాయి దాడి కేసు - నిందితుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - YS Jagan Stone Pelting Case - YS JAGAN STONE PELTING CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 10:23 PM IST
YS Jagan Stone Pelting Case Hearing: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని సమయం కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చేనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
Stone Attack on CM Jagan: కాగా మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్‌పై రాయి దాడి జరిగింది. ఈ దాడిలో సీఎం జగన్‌కు స్వల్పగాయమైంది. జగన్ బస్సు యాత్ర విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్‌కు తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్ మోహన్ రెడ్డి ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తంకాగా, వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు.