తెలంగాణ

telangana

వాగులో చిక్కుకుపోయిన తండ్రి, కుమారుడు - కాపాడిన స్థానికులు - Father son trapped in flood water

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 6:09 PM IST

Updated : Aug 11, 2024, 6:20 PM IST

Father AND Son Trapped In Flood Water (ETV Bharat)

Father AND Son Trapped In Flood Water : వాగులో కొట్టుకుపోతున్న తండ్రి, కుమారులను స్థానిక యువకులు సాహసం చేసి కాపాడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రం శివారులోని పాకాల చెక్ డ్యామ్​పై చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే? 

ఓ వ్యక్తి, తన కుమారుడితో ద్విచక్రవాహనంపై పాకాల చెక్ డ్యాం పైనుంచి వెళ్తుండగా నీటి ప్రవాహానికి వాహనం అదుపుతప్పి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానిక యువకులు హుటాహుటిన నీటి ఉద్ధృతిలో సాహసం చేసి ఇద్దరితో పాటు వాహనాన్ని సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. తండ్రి, కొడుకులిద్దరూ ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీచ్చుకున్నారు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా వారిని కాపాడిన ఆ యువకులను స్థానికులు అభినందించారు. వరదనీటి ప్రవాహం తీవ్రంగా ఉన్నందున ఎవరూ రాకపోకలు చేయకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులంటున్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు స్థానికులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Last Updated : Aug 11, 2024, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details