తెలంగాణ

telangana

ETV Bharat / videos

ముషీరాబాద్‌లో హోటల్ వద్ద యువకుల మధ్య ఘర్షణ - వీడియో వైరల్ - Street Fight In Hyderabad - STREET FIGHT IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 1:49 PM IST

Youth Street Fight In Musheerabad : హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ హోటల్ వద్ద యువకుల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వినియోగదారులిద్దరి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలి వానైంది. అక్తర్‌, అక్బర్ అనే ఇద్దరు వ్యక్తులు రామ్‌నగర్‌లోని ఓ హోటల్‌కు హలీమ్‌ తినేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిద్దరూ భాగస్వాములుగా ఉన్న వ్యాపార లావాదేవీల గురించి చర్చించుకున్నారు. అక్తర్‌ ఇ్వవ్వాల్సిన 50 వేల రూపాయల గురించి అక్బర్‌ నిలదీశాడు.

Street Fight In Hyderabad : ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి సంబంధించిన అనుచరులు కూడా చేరుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ గొడవతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనాలు ఎక్కువ మంది గుమిగూడడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించి వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details