ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి - యువకుడు దారుణ హత్య - కమలాపురంలో యువకుడు దారుణ హత్య - కమలాపురంలో యువకుడు దారుణ హత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 12:16 PM IST

Younster Brutually killed at Kamalaparam : వైఎస్సార్ జిల్లా కమలాపురంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమలాపురం నగర పంచాయతీ పక్కీర్ వీధిలో నివసిస్తున్న మహమ్మద్​పై అర్దరాత్రి సమయంలో 10 మంది దుండగులు మృతుని ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అడ్డు వచ్చిన మహమ్మద్  తల్లిదండ్రులను బెదిరించి దుండగులు పారిపోయారు. మృతుడు మహమ్మద్ ఘణి(26) గా కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 

హత్య విషయం వెంటనే తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహమ్మద్​ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్​ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. హత్య వెనక ఉన్న కుట్ర గురించి తెలుసుకోవడానికి వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details