ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కాలువలో పడి వ్యక్తి మృతి - కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు - Young Man Fell into Canal - YOUNG MAN FELL INTO CANAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 3:13 PM IST

Young Man Fell into Canal Died in Krishna District : తమ పిల్లలు బయట వెళ్లి ఇంటి తిరిగి వచ్చేంత వరకు తల్లిదండ్రులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తారు. వారికి ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంకా అంతే!  వాళ్లు ఇంటికి వచ్చేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా ఉంటారు. వారికి ఏదైనా జరిగితే తల్లడిల్లుతారు. ప్రమాదవశాత్తు తిరిగి రాని లోకాలు వెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ విషయాన్ని ఏ తల్లిదండ్రులు భరించలేరు. వారిని సముదాయించడం ఎవరి వల్లా కాదు. ఈ హృదయ విదారక సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా గుడివాడలోని పెద కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు బండి మోహన్ బైక్ మెకానిక్​గా పని చేస్తున్నారు. మోహన్ మూర్చ వ్యాధితో బాధపడతున్నారు. ప్రమాదవశాత్తు  కాలువలో పడి అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details