కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ గొడవ - హాఫీస్ ఖాన్‌కే ఇవ్వాలని అనుచరుల డిమాండ్ - Class war in YCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 5:51 PM IST
YCP MLA Ticket Issue in Kurnool: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల జగన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల నియమించగా అందులో కొంతమందిపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. తాజాగా కర్నూలులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్‌కే ఇవ్వాలని హాఫీస్ ఖాన్ అనుచరులు, కార్పొరేటర్లు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు వైసీపీ అభిమానులు, హాఫీస్ ఖాన్ అనుచరులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్‌కు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నాయకులు హాఫీస్ ఖాన్ అభిమానులు ఆందోళనతో చెంది సమావేశం నిర్వహించారు. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే వైసీపీ పదవులకు, కార్పొరేటర్ పదవికి రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. హాఫీస్ ఖాన్ మాట్లాడుతూ అధిష్టానం తనతో చర్చించారని రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారని తెలిపారు. కానీ రాజ్యసభ వద్దని కర్నూలు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని హాఫీజ్ ఖాన్ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.