వైసీపీ నేతలు అధికార మదంతో టీడీపీ నేతలపై దాడి చేస్తున్నారు: భూపేష్ రెడ్డి - ఇరు పార్టీ నేతల మధ్య గొడవ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:43 PM IST
YCP Leaders Attack TDP Leaders at Dandupalli: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం దండుపల్లెలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడి చేశారు. పది రోజుల క్రితం టీడీపీ జెండా తీసి వైసీపీ జెండా కట్టే ప్రయత్నంలో ఇరు పార్టీల మధ్య గొడవ (Clash between Two Party Leaders) జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై దాడి చేయడం దారుణమని జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు.
గాయపడిన వారిని అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు దండుపల్లెకు చేరుకొని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను భూపేష్ రెడ్డి పరామర్శించారు. అధికార మదంతో ఉన్న వైసీపీ నేతలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు.