'చీరలు అందాయా? బాగున్నాయా? ఓటు మాకేనా? ': వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ - YCP leader Violating Election code - YCP LEADER VIOLATING ELECTION CODE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 12:14 PM IST
YCP Bharat Ram Violating Election Code in East Godavari : రాజమహేంద్రవరం వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ ఇంటింటి ప్రచారం తీరు ఓటర్లను మభ్యపెట్టేలా సాగుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు ఆయా డివిజన్లలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్న ఎంపీ భరత్ మహిళా ఓటర్లను చీరలు అందాయా? అవి బాగున్నాయా? ఓటు మాకేనా? అని అడుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Rajamahendravaram : వైసీపీ ఎన్నికల ప్రచారం తీరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భరత్ రామ్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓ మహిళ హామీ పత్రం ఇచ్చినా ఇంటి పట్టా రాలేదని అనడంతో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె ఇంటి పట్టా సమస్యను వెంటనే పూర్తి చేయించాలని పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్కు సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరవాత కూడా వైసీపీ నాయకులు ఆగడాలు మితిమిరిపోయాయని విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.