ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు - టీడీపీ వర్గీయులపై దాడి - YCP leaders Attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 10:11 PM IST

YCP Activists Attacked TDP workers in Palnadu District: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన తెలుగుదేశం నేతలపై కర్రలతో దాడి చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో గాయపడిన వారిని 108 వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాజుల అంజి, పాశం రాజు, గుమ్మ శ్రీను అనే వ్యక్తులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జంగమేశ్వరపాడులో గతంలో వైసీపీ నేతలకు టీడీపీ కార్యకర్తలకు పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు గ్రామం వదిలి ఉప్పలపాడులో ఉంటున్నారు. ఓ వేడుక నిమిత్తం టీడీపీ వర్గీయులు కారంపూడి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు కాపు కాచి కర్రలతో దాడి చేశారు. వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాలను వాహనంతో ఢీకొట్టగా వారు కింద పడిన అనంతరం విచక్షణా రహితంగా దాడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details