ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దస్తగిరి ప్రచార వాహనంపై దాడి-పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు - YSRCP Activists Attacks - YSRCP ACTIVISTS ATTACKS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 9:05 PM IST

YCP Activists Attacked Dastagiri Campaign Vehicle in Pulivendula: వివేక హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరి ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైయస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీకి జై భీమ్​ రావ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా దస్తగిరి వాహనం పులివెందుల నాలుగు రోడ్ల కూడలి వద్ద వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు సిమెంటు ఇటుకలతో దాడి చేశారు. అంతటితో అగకుండా ప్రచార రథానికి ఉన్న ఫ్లెక్సీలను కూడా చించివేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్న వారించలేదని కార్యకర్తలు తెలిపారు. ఆ సమయంలో ప్రచార రథంలో దస్తగిరి లేకపోగా కార్యకర్తలు మాత్రం ఉన్నారు. విషయం తెలుసుకున్న దస్తగిరి పోలీసులకు సమాచారం అందించి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు. తమ ప్రచార రథంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని భయంతోనే తనపైన ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని దస్తగిరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details