తెలంగాణ

telangana

ETV Bharat / videos

యాదాద్రిలో బ్రహ్మోత్సవ వేడుకలు - మత్స్యావతారంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 3:31 PM IST

Yadadri Lakshmi Narasimha Swamy Brahmotsavam : రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మూడో రోజు మత్స్యావతారంలో స్వామి దర్శనమిచ్చారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్తసముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోక రక్షనార్ధం శ్రీ మహావిష్ణువు మత్స్యవతారం దాల్చి వేద రక్షణ, శిష్ట పరిరక్షణ చేశారు నృసింహుడు.  

Yadadri Narasimha Swamy Brahmotsavam 2024 : మొదట దాదాపు రెండు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేదపారాయణాలు, వేదపండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండువగా, వీనుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details