నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం- రోడెక్కిన మహిళలు - Water Crisis at Anantapur - WATER CRISIS AT ANANTAPUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 3:31 PM IST
Women protest With Empty Vessels At Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ఖాళీ బిందెలతో మహిళలు ముట్టడించారు. ఉరవకొండ పట్టణంలోని సత్యనారాయణ పేట, పాతపేట కాలనీలకు 40 రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Water Crisis at Anantapur : నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఖాళీ బిందెలతో మహిళలు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. స్థానికులు నిరసన చేస్తున్న విషయం తెలుసుకున్న డీఈఈ అంజుమన్ అక్కడికి చేరుకున్నారు. దీంతో డీఈఈతో మహిళలు తీవ్ర వాగ్వాదం చేశారు. తాగునీరు సక్రమంగా ఎందుకు సరఫరా చేయటంలేదని డీఈఈని నిలదీశారు. తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అందోళన ఉద్ధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే వారానికి నాలుగు రోజులు ఇచ్చేవారని, మళ్లీ మామూలు అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.