కాంగ్రెస్ వచ్చింది - కరవు వచ్చిందంటూ కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ప్రభుత్వ విప్ - Whip Adi Srinivas Fire on KTR - WHIP ADI SRINIVAS FIRE ON KTR
Published : Mar 28, 2024, 7:54 PM IST
Whip Aadi Srinivas Fires on KTR : కాంగ్రెస్ వచ్చింది కరవు వచ్చిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే, అధికారం కోల్పోయి నైరాశ్యంలో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వేములవాడలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆక్షేపించారు.
MLA Adi Srinivas Comments on BRS : ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో జైలులో ఉండగా, ఎంపీ సంతోశ్ రావు ఛీటింగ్ కేసు, కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాళేశ్వరంలోని 10 టీఎంసీల నీటిని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం వల్ల సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. వచ్చే వర్షాకాలంలో కూడా వానలు పడొద్దని కేటీఆర్ కోరుకుంటున్నారన్న ఆయన, వారి కుటుంబం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు.