మోదీపై దంపతుల అభిమానం- ప్రధాని చిత్రపటంతో వస్త్రం రూపకల్పన - Wishes to Pm Modi - WISHES TO PM MODI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 1:28 PM IST
Weaver Couple Different Wishes to PM Narendra Modi with Exit Poll Results : శ్రీకాకుళం జిల్లా సిక్కోలు చేనేత కార్మికులు వినూత్నంగా వస్త్రంపై మోదీ చిత్రాన్ని రూపొందించారు. విజయనగరం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సహాకారంతో లావేరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులైన నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మోదీ చిత్రాన్ని రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న వేళ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిందేకు ఈ వస్త్రాన్ని రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ తరహాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్ ముఖ చిత్రాలతో ప్రత్యేక వస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 20 రోజుల్లో తయారు చేయాల్సిన వస్త్రాన్ని 13 రోజుల్లో పూర్తి చేసినట్లు దంపతులు తెలిపారు. ఈ ప్రత్యేక చేనేత వస్త్రం శనివారం పూర్తి కావడంతో కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక నేతలు దానిని ప్రదర్శించారు. అనుకున్న సమయం కంటే ముందే వస్త్రాన్ని తయారి చేసిన వారికి అప్పలనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిల్లీలో జరగబోయే మోదీ ప్రమాణ స్వీకారానికి కానుకగా ఈ వస్త్రాన్ని ఇవ్వనున్నట్లు అప్పలనాయుడు తెలిపారు.