పంప్ హౌస్కు తాళాలు - వేతనాలివ్వాలంటూ కార్మికుల ఆందోళన - తాగునీటి కార్మికులస నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 1:25 PM IST
Water Supply Workers Protest in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో వేతనాలు చెల్లించాలంటూ తాగునీటి కార్మికులు పంప్ హౌస్కు తాళం వేసి నిరసన తెలిపారు. గతంలో నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న కార్మికులను ఆర్డబ్ల్యూఎస్ (RWS)లో కొనసాగించారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక తాగునీటి సరఫరా బాధ్యతలను శ్రీ లక్ష్మీనరసింహ మెటల్ కంపెనీ లిమిటెడ్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించిందన్నారు. సంస్థ తమకు వేతనాలు చెల్లించకుండా నిలిపి వేసిందని కార్మికులు (Workers) ఆవేదన వ్యక్తం చేశారు. Water Supply Department Workers Problems : అధికారులను కలిసి వినతి పత్రం అందజేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని కార్మికులు వాపోయారు. తాజాగా పంప్ హౌస్లను (Pump House) తనిఖీ చేయడానికి విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలియడంతో కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళనకు (Protest) దిగారు. తమకు బకాయిలు చెల్లించే వరకు తాళాలు తెరవనివ్వబోమని కార్మికులు స్పష్టం చేశారు.