'బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే వరద' అనడం వైఎస్సార్సీపీ నేతల అజ్ఞానం: వరప్రసాద్ - Varaprasad on Floods - VARAPRASAD ON FLOODS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 5:14 PM IST
Water Resources Department Expert Varaprasad on Floods: బుడమేరు వరద ప్రవాహానికి 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో కురిసిన వర్షం ప్రధాన కారణామని జలవనరుల శాఖ నిపుణులు వరప్రసాద్ తెలిపారు. 17 రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే కురవడంతో ఈ ఉత్పాతం సంభవించిందని వరప్రసాద్ వెల్లడించారు. నష్ట నివారణ చర్యలతో పాటు ముందస్తు ప్రణాళికలు, మైనర్ వాగులకు గేజ్‌ల ఏర్పాటు చేస్తే వరద ముంపు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వరప్రసాద్ స్పష్టం చేశారు. బుడమేరు గేట్లు ఎత్తడం వల్లే ముంచిందనడం హాస్యాస్పదమని, అది వైఎస్సార్సీపీ నేతల అజ్ఞానమని అన్నారు. చిన్న వాగులకు గేజ్‌లు ఏర్పాటు చేయాలని వరప్రసాద్ సూచించారు. చిన్నపెద్ద వాగులనే తేడా లేకుండా అన్నింటినీ నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ముందస్తు చర్యలు చేపడితేనే ప్రమాదాలను నివారించగలని తెలిపారు. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తే ప్రాణనష్టాన్ని తప్పించవచ్చని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని వరప్రసాద్ సూచించారు.