ఓటరు జాబితాలో ఇంటి నంబర్ల మాయాజాలం - రెండు నంబర్లతో 46 ఓట్లు - పాల్తూరులో దొంగ ఓట్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:10 PM IST
Voter List Mistakes in Anantapur District : ఓటర్ల తుది జాబితాను పరిశీలించే కొద్ది అందులో ఇంటి నంబర్ల మాయాజాలం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో రెండు ఇంటి నంబర్లతో ఒకే పోలింగ్ బూత్‌లో 46 దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఈ ఓటరు జాబితాలో ఒక్క అంకెగల ఇంటి నంబర్లతో మరో 32 దొంగ ఓట్లు నమోదయ్యయి.
పాల్తూరులోని పోలింగు కేంద్రంలో 40లో మొత్తం 1246 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కేంద్రంలోని వరస సంఖ్య 4, 26, 27, 28, 29, 34, 35, 36, 38, 41, 42, 43, 44, 45,53,54,58,59,60,62,63,64,65,66,68,69 లలో ఉన్న ఓటర్లతో పాటు మరింత మంది ఇంటి నంబర్లు 1-1తో నమోదయ్యాయి. వారంతా ఏకంగా 32 మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఇంటి నంబర్లతో ఒకే పోలింగు కేంద్రంలో 46 మంది ఓటర్లు ఉండడం విశేషం. ఓటరు జాబితాలో సింగిల్ డిజిట్టుతో ఇంటి నంబర్లు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా సింగిల్ డిజిట్లు ఇంటి నంబర్లు ఉండవు. ఇదే ఓటరు జాబితాలో ఇంటి నంబరు 1-18తో 14 ఓట్లు నమోదు అయ్యాయి.