ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎంపీడీవో కార్యాలయంలో వాలంటీర్ జన్మదిన వేడుకలు - ప్రతిపక్షాల మండిపాటు - Volunteer Birthday Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 4:58 PM IST

Volunteer Birthday Celebrations in Sangam MPDO Office: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో పలువురు వాలంటీర్ల తీరులో మార్పు రావడం లేదు. వాలంటీర్ల తీరుపై ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. ఈ సారి ఏకంగా ఎంపీడీవో కార్యాలయంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వాలంటీర్ జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ కన్వీనర్ కంటబత్తిన రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వాలంటీర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రసాద్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు జరిపారు. 

ఈ కార్యక్రమం పలువురు వైసీపీ నాయకుల సమక్షంలో ఎంపీడీవో కార్యాలయంలో జరిగాయి. జన్మదిన వేడుకులకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ సంఘటనపై స్థానిక ప్రతిపక్ష నాయకులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం కార్యాలయంలో వాలంటీర్ జన్మదిన వేడుకలు జరపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details