ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి Vs నిఖిల్​నాథ్​ రెడ్డి - ఈద్గా మైదానం వద్ద ఉద్రిక్తత - YCP LEADER VISWESWARA REDDY - YCP LEADER VISWESWARA REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 2:52 PM IST

Visweswara Reddy Car Hit Nikhilnath Reddy Car in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఈద్గా మైదానం(Eidgah Maidan) వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, ఆయన తమ్ముడు కుమారుడు నిఖిల్​నాథ్​ రెడ్డి వేర్వేరు వావానాల్లో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలు అనంతరం విశ్వేశ్వరరెడ్డి కారులో వెళ్తుండగా అనుకోకుండా నిఖిల్​నాథ్​ రెడ్డి కారును ఢీ కొట్టింది.

నిఖిల్​నాథ్​ రెడ్డి కారును ఢీకొన్న తరుణంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తున్న విశ్వేశ్వర రెడ్డి కారును నిఖిల్​నాథ్​ రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ఇరువర్గాల వారిని నిలువరించి సర్ది చెప్పారు. ఇరువర్గాల వారు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం పోలీసులు వెనుతిరిగారు.

ABOUT THE AUTHOR

...view details