LIVE: తహసీల్ధారు రమణయ్య హత్య కేసు - విశాఖ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 6:19 PM IST
|Updated : Feb 5, 2024, 6:33 PM IST
విశాఖలోని తహసీల్ధారు రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావును పోలీసులు చెన్నైలో అదుపులో తీసుకున్నారు. ఏసీపీ త్రినాధ్ నేతృత్వంలో బృందం తమిళనాడు వెళ్లింది. స్థిరాస్తి లావాదేవిలే హత్యకు దారి తీశాయని విచారణాధికారులు అంటున్నారు. నిందితుడు ఆర్ధిక లావాదేవీలను పోలీసులు ఆరా తీశారు.
ఈ కేసు దర్యాప్తునకు ఇద్దరు ఏసీపీలను, 10 బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడు ఎయిర్‌పోర్టు వైపు వెళ్లినట్లు గుర్తించామని, విమానం కూడా ఎక్కినట్లు తెలిసిందని సీపీ తెలిపారు. నిందితుడి సెల్ డేటా ద్వారా విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఒక బ్యాంక్ లోన్ వ్యవహారంలో డిఫాల్టర్‌గా ఉన్నాడని గుర్తించినట్టు చెప్పారు. త్వరితగతిన నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. హత్యకు కారణం రియల్ ఎస్టేట్, భూవివాదాలేనని అన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ రమణయ్య మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో పంచనామా పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రమణయ్యకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు నివాళులర్పించారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యర్ మీడియా సమావేశంలో వివరాలు తెలియజేనున్నారు.