ETV Bharat / state

ఆధార్​తో అక్రమార్కులకు చెక్ - టీటీడీ కీలక నిర్ణయం​ - TTD FAKE TICKETS

నకిలీ గుర్తింపు కార్డులతో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు - టీటీడీ పాలకమండలి ఆధార్‌ సేవలను వినియోగించుకునేందుకు ఆమోద ముద్ర

TTD Focus on Tirumala Srivari Seva Tickets
TTD Focus on Tirumala Srivari Seva Tickets (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 8:15 AM IST

TTD Focus on Tirumala Srivari Seva Tickets : నకిలీ గుర్తింపు కార్డులతో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు, వసతి గదులను పొందేందుకు అక్రమార్కులు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. ఇందుకోసం ఆధార్‌ను టీటీడీలోని పలు సేవలకు అనుసంధానం చేయనుంది. వివిధ సేవలకు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో భక్తులు సమర్పిస్తున్న గుర్తింపు కార్డులు నిజమా కాదా అనేది నిర్ధారించుకునే వ్యవస్థ టీటీడీలో లేకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

20 లక్షలు చెల్లించాలి : ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లపై టీటీడీ ఈఓ శ్యామలరావు సమీక్షించారు. ఐటీ విభాగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థతో పాటు ఆధార్‌ ప్రమాణాల ద్వారా వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. టీటీడీ అధికారులతో యూఐడీఏఐ ప్రతినిధులు సమావేశమై, సేవలకు ఆధార్‌ అనుసంధానం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు

ఆధార్‌ చట్టం-2016 ప్రకారం సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు రెండు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్‌ రుసుము కింద 20 లక్షలు టీటీడీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ఆధార్‌ గుర్తింపునకు 40 పైసలు, ఈకేవైసీకి 3 రూపాయల 40పైసలు టీటీడీ కట్టాల్సి ఉంటుంది. ఇటీవలే టీటీడీ పాలకమండలి సైతం ఆధార్‌ సేవలను వినియోగించుకునేందుకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేస్తే ఆధార్‌ సేవలను టీటీడీ వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

TTD Released Srivari Arjitha Seva Tickets for February 2025 : భక్తుల సౌకర్యార్థం 2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ఈ నెల 25వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల చేశారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను అందుబాటులో ఉంచారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​- ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ఇకపై ఆ టికెట్లు రద్దు - రెండు గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం - టీటీడీ సంచలన నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.