LIVE: సీఎం జగన్పై దాడి ఘటనపై విజయవాడ సీపీ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - cp kanthi rana tata press meet
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 6:30 PM IST
|Updated : Apr 15, 2024, 6:44 PM IST
Vijayawada CP Kanthi Rana Tata Press Meet: సీఎం జగన్పై దాడి ఘటనపై విజయవాడ సీపీ కాంతి రాణా టాటా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుల వివరాలు చెబితే పారితోషికం ఇస్తామని విజయవాడ సీపీ కాంతిరాణా పత్రికా ప్రకటనలో తెలిపారు. నిందితుల వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు పారితోషకం ఇస్తామన్నారు. విలువైన సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ హామీ ఇచ్చారు. కంచి శ్రీనివాసరావు డీసీపీ, శ్రీహరిబాబు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీలకు వాట్సప్ ద్వారా కానీ, ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.సీఎంపై రాయి దాడి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో 20 మందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు. స్థానికులను విచారణ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 15, 2024, 6:44 PM IST