క్రీడాకారులకు ఎన్నికల తాయిలాలు - క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన విజయసాయి రెడ్డి - Vijayasai Reddy
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 7:10 PM IST
Vijayasai Reddy Distributing Election Gifts to Sportspersons : ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అధికార పార్టీ ప్రలోభాలకు తెర తీస్తోంది. ఇంత వరకు వాలంటీర్లు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను పంపిణీ చేశారు. తాజాగా నెల్లూరు జిల్లాలో క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేసేందుకు వైసీపీ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాలను ప్రొత్సహించడానికి 'ఆడుదాం ఆంధ్ర'ను ప్రభుత్వం నిర్వహించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో క్రికెట్కు మంచి ఆదరణ ఉందని, గుర్తింపు పొందిన వారు నేడు రాజకీయాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాలను అభివృద్ధి చేయడానికి వైసీపీ అభివృద్ధి చేయడానికి ఎంతోగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్ కోసం సేకరించిన 150 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని పేర్కొన్నారు. అక్కడ అన్ని రకాల క్రీడాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.