LIVE: వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవం - పాల్గొన్న ఉపరాష్ట్రపతి - ప్రత్యక్షప్రసారం - Swarna Bharat Trust 23 Anniversary - SWARNA BHARAT TRUST 23 ANNIVERSARY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 12:46 PM IST
Jagdeep Dhan Khad in Swarna Bharat Trust Anniversary Live: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ నెల్లూరుకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అక్షర విద్యాలయానికి చేరుకుని స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టులో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీలు వేమిరెడ్డీ ప్రభాకర రెడ్డి,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎంఎల్ఏలు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ప్రత్యక్షప్రసారం మీకోసం.